Dailyhunt
రాజా రవివర్మ చిత్రానికి రూ.167 కోట్లు

రాజా రవివర్మ చిత్రానికి రూ.167 కోట్లు

భారతీయ కళా ప్రపంచంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన ఓ అరుదైన పెయింటింగ్ వేలంలో భారీ ధరకు అమ్ముడై కొత్త రికార్డు సృష్టించింది.

1890ల కాలంలో రూపొందించిన "యశోద-చిన్న కృష్ణుడు" ఆయిల్ పెయింటింగ్‌ను ముంబయిలో నిర్వహించిన వేలంలో ₹167.2 కోట్లకు విక్రయించారు. ఇది భారతీయ కళా చరిత్రలో అత్యధిక ధర పలికిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఈ వేలాన్ని ప్రముఖ సంస్థ Saffronart స్ప్రింగ్ లైవ్ ఆక్షన్‌గా ముంబయిలో నిర్వహించింది. దేశ విదేశాల నుంచి పలువురు కళా సేకరణకారులు పాల్గొన్నారు.ఈ అరుదైన చిత్రాన్ని Cyrus Poonawalla కొనుగోలు చేశారు. ఆయన Serum Institute of India వ్యవస్థాపకుడిగా ప్రసిద్ధి చెందారు.

"యశోద-కృష్ణుడు" ఉండే ఈ చిత్రంలో తల్లి ప్రేమను ప్రతిబింబించే సన్నివేశం,సాంప్రదాయ భారతీయ కళా శైలి,సున్నితమైన భావోద్వేగాలు అన్నీ కలసి ఈ చిత్రాన్ని మరింత విలువైనదిగా మార్చాయి.

రాజా రవివర్మ చిత్రానికి వచ్చిన ఈ భారీ ధర భారతీయ కళకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపును మరోసారి రుజువు చేసింది. ఈ వేలం భారత కళా మార్కెట్‌లో కొత్త మైలురాయిగా నిలిచింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu