ఐపీఎల్ చరిత్రలో లెజెండ్‌గా నిలిచిన రోహిత్ శర్మకి మరో పెద్ద సవాలు ఎదురుకానుంది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న రోహిత్ కు రాజస్థాన్‌పై అంతమంచి ట్రాక్ రికార్డు లేదు.
గతంలోనూ రాజస్థాన్ బౌలర్లను ఎదుర్కొవడం కష్టంగా మారింది. ప్రధానంగా జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ ను ఎదుర్కొవడం సవాలే.
జోఫ్రా ఆర్చర్ కొత్త బంతితోనే ప్రమాదకరంగా మారతాడు. కేవలం 10 బంతుల్లోనే రోహిత్‌ను రెండు సార్లు ఔట్ చేశాడు. సందిీప్ శర్మ అయితే మరింత కఠినంగా మారాడు - 38 బంతుల్లో ఐదు సార్లు ఔట్ చేసి కేవలం 44 పరుగులే ఇచ్చాడు. రవీ బిష్ణోయ్ కూడా తన వేరియేషన్లతో రోహిత్‌ను ఇబ్బంది పెట్టాడు. ఇప్పటికే మూడు సార్లు అతడిని ఔట్ చేశాడు.
రాజస్థాన్‌పై మొత్తం 30 మ్యాచ్‌లు ఆడాడు రోహిత్. 29 ఇన్నింగ్స్‌లో 600 పరుగులు చేయగా సగటు: 20.68గా ఉంది. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉండగా అత్యధిక స్కోర్: 73. అయితే ముంబై అభిమానులు రోహిత్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. ముఖ్యంగా టాప్ ఆర్డర్‌లో మంచి ఆరంభం ఇస్తే, జట్టుకు భారీ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది.

