Dailyhunt
'రాకా'..18 ఏళ్ల కల!

'రాకా'..18 ఏళ్ల కల!

కాన్ స్టార్ అల్లు అర్జున్ - దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న 'రాకా' ఫస్ట్ లుక్ సినీ ప్రేమికులకు పెద్ద షాక్‌లా మారింది. ఇప్పటివరకు ఎవరూ ఊహించని విధంగా డార్క్, విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తోందని స్పష్టమైంది.

బోల్డ్ లుక్‌లో, వోల్ఫ్‌లాంటి చేతితో ముఖం కప్పబడిన అల్లు అర్జున్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ చర్చలకు దారి తీసింది. ఈ లుక్ చూసి ఫ్యాన్స్ ఎన్నో థియరీలు చెబుతున్నారు.

అయితే, ఈ హైప్‌కు మరింత ఎమోషనల్ టచ్ ఇచ్చిన వ్యక్తి దర్శకుడు అట్లీ. ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం X (ట్విట్టర్)లో చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. 18 సంవత్సరాలుగా ఒక ఆలోచనను నా దగ్గరే ఉంచుకున్నాను. అది ఎప్పుడూ మాయమవ్వనీయలేదు. అది నన్ను పరీక్షించింది, నన్ను తీర్చిదిద్దింది. నిజానికి ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ అట్లీ వెల్లడించారు.

ఈ మాటలతో 'రాకా' కేవలం ఒక భారీ బడ్జెట్ సినిమా కాదు, అట్లీ జీవితంలో 18 ఏళ్లుగా పెంచుకున్న కల అని స్పష్టమైంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె కీలక పాత్రలో నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా మొత్తం 7 భాషల్లో, అంతర్జాతీయ స్థాయిలో 2027 మధ్యలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి, 'రాకా' సినిమా ఒక సాధారణ కమర్షియల్ ప్రాజెక్ట్ కాకుండా, దర్శకుడు అట్లీ 18 ఏళ్లుగా మోస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu