Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం

శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టుపై 165 పరుగుల భారీ తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది.

మ్యాచ్ ఆసాంతం భారత ఆటగాళ్లు అద్బుత ప్రదర్శన కరపరిచారు. చివరి వరకు పట్టుసడలని పోరాటంతో ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఈ మ్యాచ్‌లో యువ బౌలింగ్ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో సుతార్ ఏకంగా 6/55 వికెట్లు పడగొట్టాడు. అతని అద్భుతమైన బౌలింగ్ దాడితోనే శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. లంక జట్టు పతననాన్ని సుతార్ తన గుగ్లీలు, స్పిన్ మ్యాజిక్‌తో శాసించాడు.

మ్యాచ్ చివర్లో సుతార్ ఒకే ఓవర్‌లో మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు. 76వ ఓవర్‌లో వరుస బంతులతో లంక బ్యాటర్లను పెవిలియన్‌కు పంపాడు. తొలుత సోనల్ దినూష (84)ను ఔట్ చేశాడు. ఆ వెంటనే తర్వాతి బంతికే ప్రభాత్ జయసూర్య (0)ను కూడా డకౌట్ చేశాడు.

అదే ఓవర్‌లో చివరి బంతికి లాహిరు కుమార (0)ను ఔట్ చేశాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో సుతార్ టెస్టుల్లో తన ఐదు వికెట్ల ఘనతను పూర్తి చేసుకున్నాడు. యువ ఆటగాడు సుతార్ రాణించడంతో టీమ్‌ఇండియా తొలి టెస్టులో చిరస్మరణీయ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu