Dailyhunt
తెలంగాణ ఎక్సైజ్ శాఖ సరికొత్త రికార్డు..

తెలంగాణ ఎక్సైజ్ శాఖ సరికొత్త రికార్డు..

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదాయంలో చరిత్ర సృష్టించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఒకే ఆర్థిక సంవత్సరంలో ₹44,000 కోట్ల మైలురాయిని అధిగమించింది.

2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖకు అన్ని మార్గాల ద్వారా కలిపి మొత్తం ₹44,557 కోట్ల ఆదాయం నమోదైంది. ఇది ఇప్పటివరకు రాష్ట్రంలో ఎప్పుడూ లేని రికార్డు.

మొత్తం మద్యం అమ్మకాల విలువ: ₹40,209 కోట్లు కాగా ఎక్సైజ్ సుంకం ద్వారా వచ్చిన ఆదాయం: ₹39,368 కోట్లు అని అధికారులు వెల్లడించారు. అలాగే మద్యం విక్రయాలే కాకుండా, లైసెన్స్ ఫీజుల రూపంలో కూడా ప్రభుత్వం గణనీయమైన ఆదాయం పొందింది.

రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలు → ₹1,771 కోట్లు,1,214 బార్లు → ₹549 కోట్లుతో రికార్డు స్థాయికి చేరింది ఆదాయం. ఈ గణాంకాలతో ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక ఆదాయ వనరుగా నిలిచింది. ఒకే ఏడాదిలో ఇంత భారీ స్థాయిలో ఆదాయం రావడం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి.

ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరగడం రాష్ట్రానికి ఆర్థికంగా బలాన్ని ఇస్తున్నప్పటికీ, మద్యం వినియోగం పెరుగుదలపై కూడా చర్చ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, ఈ రికార్డు ఆదాయం ప్రభుత్వానికి ముఖ్యమైన వనరుగా నిలిచింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu