Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఊహకందని ట్విస్ట్‌తో 'దృశ్యం 3'!

ఊహకందని ట్విస్ట్‌తో 'దృశ్యం 3'!

సినిమా ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'దృశ్యం 3' అప్పుడే భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. అయితే, ఈ సినిమా ముగింపుకి సంబంధించి తాజాగా ఒక సంచలన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ మూడో భాగం కేవలం ముగింపుతోనే ఆగిపోకుండా.. కథలో మరింత చీకటి కోణాన్ని చూపిస్తూ, మరో మైండ్ బ్లోయింగ్ థ్రిల్లింగ్ చాప్టర్‌కు దారితీసేలా ముగుస్తుందని సమాచారం.

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ల్యాండ్‌మార్క్ క్యారెక్టర్ అయిన 'జార్జ్‌కుట్టి'గా నటిస్తున్న ఈ మూడో పార్ట్.. సస్పెన్స్ మరియు ఎమోషనల్ డ్రామాను సరికొత్త స్థాయికి తీసుకెళ్లనుంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. 'దృశ్యం 3' క్లైమాక్స్ థియేటర్లలో ప్రేక్షకులను తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా, ఈ కథ ఇక్కడితో అయిపోలేదు అనేలా ఒక భయంకరమైన ట్విస్ట్‌తో తదుపరి భాగానికి హింట్ ఇస్తుందని తెలుస్తోంది. దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ ఫ్రాంచైజీని భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన థ్రిల్లర్ సిరీస్‌గా మలిచారు.

ఎప్పటిలాగే జీతూ జోసెఫ్ తన మార్క్ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్‌కు.. ఊహకందని మైండ్ బెండింగ్ ట్విస్టులను జోడించి, సినిమా ముగిసే వరకు ప్రేక్షకులు సీట్ల అంచున కూర్చునేలా ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu