Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

వరదలు..బస్సు దిగుతూ కొట్టుకుపోయిన మహిళ!

మెరికాలోని ప్రముఖ నగరం న్యూయార్క్ భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా అతలాకుతలమైంది. నగరంలోని రహదారులన్నీ నదులను తలపిస్తుండగా.. అక్కడ ఎంతటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయో చూపించే ఒక భయానక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

సిటీ బస్సు దిగుతున్న ఒక మహిళ.. చూస్తుండగానే వరద ఉధృతికి కొట్టుకుపోయిన దృశ్యాలు నెటిజన్లను వణికించేస్తున్నాయి.

న్యూయార్క్‌లోని క్వీన్స్, బ్రూక్లిన్ వంటి జనసాంద్రత కలిగిన ప్రాంతాలపై వాన దంచికొట్టింది. కొన్ని ప్రాంతాల్లో కేవలం గంట వ్యవధిలోనే దాదాపు 5 సెంటీమీటర్ల (రెండు అంగుళాలకు పైగా) రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయి, అండర్‌పాస్‌లు, రోడ్లపై మోకాళ్లకు పైగా నీరు చేరింది. వరద ఉధృతికి వందలాది వాహనాలు కొట్టుకుపోగా.. పలు సబ్‌వే రైలు సేవలు, బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. బస్సు దిగడమే శాపమైంది..వైరల్ అవుతున్న 15 సెకన్ల వీడియోలో.. రోడ్డుపై తీవ్రమైన వరద నీరు వేగంగా ప్రవహిస్తోంది.

ఈ క్రమంలో ఒక సిటీ బస్సు రోడ్డు మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రయాణికులు నేరుగా ఆ నీటిలోనే దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.పింక్ కలర్ టాప్ ధరించిన ఒక మహిళ బస్సు దిగి, నెమ్మదిగా రోడ్డు పక్కన ఉన్న ఫుట్‌పాత్ వైపునకు వెళ్లడానికి ప్రయత్నించింది. అయితే, ప్రవాహం ఊహించని విధంగా అత్యంత బలంగా ఉండటంతో ఆమె ఒక్కసారిగా అదుపు తప్పి కిందపడిపోయింది. రోడ్డు అంచును బలంగా ఢీకొట్టి, చూస్తుండగానే ఆ నీటి ఉధృతిలో కొట్టుకుపోయింది. అక్కడే ఉన్న తోటి ప్రయాణికులు, పౌరులు ఆమెను కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ, నీటి వేగం ఎక్కువగా ఉండటంతో ఆపలేకపోయారు. డ్రైనేజీ లోపమే కారణమన్న మేయర్ఈ ఘోర వరదలపై న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ స్పందించారు. నగరంలోని మురుగునీటి వ్యవస్థ గంటకు గరిష్టంగా రెండు అంగుళాల వర్షాన్ని మాత్రమే తట్టుకునేలా రూపొందించబడిందని.. కానీ అంతకంటే ఎక్కువ వర్షం అత్యంత తక్కువ సమయంలో కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయని వివరించారు. ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ బృందాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.ఆందోళనలో నెటిజన్లు: డ్రైవర్ సురక్షితమైన చోట కాకుండా రోడ్డు మధ్యలోనే బస్సు ఆపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నెటిజన్లు మండిపడుతున్నారు. వరదల్లో కొట్టుకుపోయిన ఆ మహిళ సురక్షితంగా బయటపడాలని వేలాది మంది ప్రార్థిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu