Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

వివాహేతర సంబంధం.. ఉమ్మెత్త గింజల పొడిని ఇడ్లీలో కలిపి..

కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఒక దారుణ సంఘటన వెలుగుచూసింది. హుణసూరు తాలూకా వినోబా కాలనీకి చెందిన పవిత్ర అనే మహిళ తన భర్త రామప్రసాద్‌ (35)ను దారుణంగా హత్య చేసింది.

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది.

రామప్రసాద్ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవాడు. వీరికి పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొన్నాళ్లుగా పవిత్రకు స్థానికుడైన సునీల్‌ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తను అడ్డుతొలగించుకోవడానికి వీరిద్దరూ కలిసి ఒక పథకం వేశారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా హత్య చేసేందుకు యూట్యూబ్‌లో పలు వీడియోలు వెతికారు.

ఈ క్రమంలో ఉమ్మెత్త గింజలతో ప్రాణాలు తీయవచ్చని తెలుసుకున్నారు. ఈ నెల 16 రాత్రి రామప్రసాద్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో పవిత్ర ఇడ్లీలలో ఉమ్మెత్త గింజల పొడిని కలిపి అతనికి పెట్టింది. అయితే ఆ ఆహారం తిన్న తర్వాత కూడా రామప్రసాద్ చనిపోలేదు. దాంతో ఆమె వెంటనే ప్రియుడు సునీల్‌ను ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి రామప్రసాద్ గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశారు.

మరుసటి రోజు ఉదయం ఏమీ తెలియనట్లు నాటకమాడింది. తన భర్త నిద్రలేవడం లేదని మరిది చంద్రహాస్‌కు సమాచారం ఇచ్చింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే రామప్రసాద్ మరణించాడని వైద్యులు చెప్పారు. వదిన తీరుపై అనుమానం వచ్చిన చంద్రహాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు. నిందితులు ఇద్దరూ నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu