Dailyhunt
యువ హీరోతో లిప్‌లాక్‌కు రెడీ అయిన భామ..?

యువ హీరోతో లిప్‌లాక్‌కు రెడీ అయిన భామ..?

లిప్‌లాక్ చేసేందుకు అందాల రాక్షసి రెడీ అయిపోయిందా? అడపా దడపా గ్లామర్ సీన్లతో అలరించిన నార్త్ బ్యూటీ ముద్దు సీన్‌కు ఓకే చెప్పిందా? నటనతో పాటు కాస్త గ్లామర్ డోసు పెంచితేనే లాభం అనుకుంటోందా? అంటే అవుననే అంటోంది ఫిల్్మ నగర్‌! అవును. సందీప్ కిషన్‌కు జోడీగా ఏ1 ఎక్్సప్రెస్ సినిమాలో లావణ్య త్రిపాఠి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది.

ఇందులో కొన్ని సన్నివేశాలు చూస్తుంటే హీరోహీరోయిన్లు లిప్‌లాక్ చేస్తున్నట్లు కనిపించింది. దీంతో యువ హీరోతో ఘాటు ముద్దుకు లావణ్య సిద్ధమైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాదాపు 16 చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించినంత గుర్తింపు రాకపోవడంతో ఈ భామ హద్దులు చెరిపేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఉందని మూవీ లవర్్స అంటున్నారు.

ఇక ఈ చిత్రంలో ఇద్దరు హాకీ ప్లేయర్లుగా నటిస్తున్నారు. కేవలం ఆటపైనే కాకుండా కమర్షియల్ అంశాలపై కూడా ఫోకస్ చేసిన దర్శకుడు వీరి మధ్య అధర చుంబనం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ఇక ఇన్నాళ్లు గ్లామర్ షో చేయడం నచ్చదని చెప్పిన లావణ్య మరి నిజంగానే సందీప్‌తో లిప్‌లాక్ చేసిందో తెలియాలంటే సినిమా విడుదలయ్యేదాకా ఆగాల్సిందే మరి! ఇదిలా ఉంటే ఆమె నటించిన చావు కబురు చల్లగా చిత్రం కూడా రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కూడా హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్లు బాగానే ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది.

మన హీరో,హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పేది వీళ్ళే..!

మన స్టార్ హీరోలకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా ?

గుండె కోసం ఈ పది సూపర్ ఫుడ్స్

చలికాలంలో ఇవి తింటే ఆరోగ్యం పదిలం.!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu