రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
రాజీవ్ సద్బావన యాత్రలో వీరప్ప మొయిలీ
స్వార్ధశక్తులకు ప్రజలే గుణపాఠం చెప్పాలి: రేవంత్ రెడ్డి
చార్మినార్, రాజేంద్రనగర్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే సమర్ధ యువ నాయకునిగా పేరు తెచ్చుకున్నారని కర్ణాటక మాజీ సీఎం వీరప్ప మొయిలీ అన్నారు.
మహాత్మ గాంధీ మాదిరిగా రాజీవ్ కూడా దేశం కోసం ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్, ఇందిర సేవలు చిరస్మరణీయమన్నారు. 2023లో తిరిగి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కులాలు, మతాలు, ప్రాంతాల పేరిట ఈ రాష్ట్రాన్ని విడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న స్వార్ధశక్తులకు రాష్ట్ర ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్ హనుమంతరావు, మల్లు భట్టి విక్రమార్క, తదితరులు పాల్గొన్నారు.

