Dailyhunt
ఆ కారు.. ఖమ్మం చేరింది!

ఆ కారు.. ఖమ్మం చేరింది!

- హైదరాబాద్‌లో వినియోగించుకున్న ఓ అధికారి

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయం అంబులెన్స్‌ కథ సుఖాంతం అయ్యింది.

కారు ఖమ్మం నగరానికి చేరుకుంది. ఏంటీ కారు కథాకమామీషు అనుకుంటున్నారా..? ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అంబులెన్స్‌ను హైదరాబాద్‌లో హెల్త్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో ఉండే ఓ ఉన్నతాధికారి కారుగా మార్చుకుని వినియోగిస్తున్నారంటూ 'ఆంధ్రజ్యోతి'లో కథనం సెప్టెంబర్‌ 31న ప్రధాన సంచికలో ప్రచురితం అయ్యింది. దీంతో డీఎంహెచ్‌వో కార్యాలయంలో కారు సంఘటనపై కలకలం రేగింది. జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సైతం కారుపై ఆరా తీశారు. జిల్లా అధికారుల ఒత్తిడో లేకుంటే హైదరాబాద్‌లో డీఎస్‌ కార్యాలయం అధికారుల చొరవతోనో (ఏపీ20టీసీ 2701 నెంబరు) కారు ఖమ్మం డీఎంహెచ్‌వో కార్యాలయానికి చేరింది.. ఈ విషయమై జిల్లా అధికారులను సంప్రదించగా మంగళవారం హైదరాబాద్‌ నుంచి ఖమ్మానికి తీసుకొచ్చినట్లు వివరించారు.

 షర్మిల తెలంగాణలో రోడ్డుపై పడింది: చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy