కర్ణాటకలో ప్రమాదం.. రంగారెడ్డి వాసులుగా గుర్తింపు
బళ్లారి, అక్టోబరు 19 : విహార యాత్ర విషాదాన్ని మిగిల్చింది.
శనివారం కొప్పళ జిల్లా గంగావతి తాలూకా పరిధిలోని సంగాపుర్ గ్రామానికి చేరుకుని ఓ రిసార్ట్‌లో బస చేశారు. సోమవారం తెల్లవారుజామున వారంతా సమీపంలో ఉన్న చెరువులో ఈత కొట్టారు. అందులో ఇద్దరు నీటిలో నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో మిగిలిన ఇద్దరు ఒడ్డుకు చేరుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు గల్లంతైన వారి కోసం వెతికారు. మృతి చెందిన వారిని మధుకిరణ్ (25), రాజేష్ కుమార్(26)గా గుర్తించారు. నరసింహ, అలోక్ కుమార్ ప్రాణాలతో బయట పడ్డారు.
