
కారేగాంలో ఇసుక తరలింపుపై గ్రామస్థుల ఆగ్రహం
కోటగిరి, జనవరి 7: మండలంలోని కారేగాం గ్రామంలో శుక్రవారం ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను గ్రామస్థులు అడ్డుకున్నారు.
మండలంలోని హంగర్గ ఇసుక క్వారి నుంచి వర్ని మం డలంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో ఇసుక తరలించేందుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. గత మూడు రోజుల నుంచి ఇసుక రవాణా కొనసాగుతోంది. అయతే, ఇసుక రవా ణా చేసే నిర్వాహకులు పెద్ద వాహనాల్లో ఓవర్ లోడ్‌తో ఇసుకను తరలిస్తున్నారు. అధికారు లు ఒక్కో వాహనానికి మూడు క్యూబిక్ మీటర్లు ఇసుకను తరలించేందుకు అనుమతించగా.. నిర్వాహకులు ఆరు క్యూబిక్ మీటర్ల మేర ఇసుకను తరలిస్తున్నారని ఆందోళనకారులు ఆరో పించారు. అంతేకాకుండా రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయని, 20ఏళ్ల క్రితం వేశారని గ్రామస్థు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రోడ్డు పనులు ప్రారంభించారని, ప్రస్తుతం మెటల్ పనులు పూర్తి కాగా ఓవర్ లోడ్‌తో వాహనాలు వెళుతుంటే గ్రామంలో దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయారు. హంగర్గ నుంచి ఇసుకను తరలించేందుకు అనుమతించిన అధికారులు ఆ గ్రామం నుంచి ఇసుకను తీసుకువెళ్లకుండ తమ గ్రామం వైపు నుంచి తీసుకువెళ్లడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. తమ గ్రామం మంజీర నదికి చెంతనే ఉన్నా డబుల్ బెడ్ రూమ్‌లతో పాటు వివిధ అభివృద్ధి పను లకు ఇసుక కావలంటే అధికారులు అనుమతించడం లేదని వారు తెలిపారు. స్థానిక అవస రాలను కాదని ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలించేందుకు అనుమతించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వాహనాలు అధిక వేగంతో వెళితే ప్రమాదాలు సైతం చోటు చేసుకు నే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరు కుని, ఇసుక రవాణాకు అనుమతి ఉందని ఎస్సై రాము వారికి నచ్చజెప్పారు. చివరకు, తమ గ్రామం నుంచి ఇసుక వాహనాలు తరలించరాదని, లేదంటే ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఇందులో గ్రామస్థులు ఈర్వంత్‌రావు పటేల్, రాజారాం, గంగాధర్, మారుతీ, రాజు, దత్తు పటేల్, సంజు పటేల్ తదితరులు ఉన్నారు.
ఫ అభివృద్ధి పనుల కోసమే అనుమతి : రాజేశ్వర్, బోధన్ ఆర్డీవో
జిల్లాలో డబుల్ బెడ్ రూజలతో పాటు వివిధ అభివృద్ధి పనులకు ఇసుక కొరత తలెత్తకుం డా కలెక్టర్ క్వారీని మంజూరు చేశారు. హంగర్గ క్వారీలో 20వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించేందుకు అనుమతి ఉంది. మంజీర నదిలో లేబర్ సాయంతో ట్రాక్టర్లలో నింపి ఒడ్డుకు డంప్ చేస్తున్నాం. అక్కడి నుంచి జేసీబీ సాయంతో టిప్పర్లలో ఇసుకను తరలించేలా వే బిల్లులు ఇస్తున్నాం. దూర ప్రాంతాలకు టిప్పర్లలో ఇసుకను తరలించేందుకు అనుమతి ఇచ్చాం. ప్రతీ వాహనంలో లోడ్ చేసే సమయం నుంచి లబ్ధిదారులకు చేరే వరకు వీఆర్‌ఏలు విధుల్లో ఉంటారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.