ఆంధ్రజ్యోతి

మహారాష్ట్రలో రూపాయికే లీటర్ పెట్రోల్

మహారాష్ట్రలో రూపాయికే లీటర్ పెట్రోల్
  • 531d
  • 27 shares

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కుమారుడు మంత్రి ఆదిత్య థాక్రే బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు రూపాయికే లీటరు పెట్రోల్ అందించారు. డోంబీవలీ యువసేన ఆధ్వర్యంలో థాణేలోని ఓ పెట్రోల్ బంక్‌లో ఈ అవకాశం కల్పించారు. రూపాయికే పెట్రోల్ ఇస్తున్నారని తెలియగానే వాహనదారులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. బంక్ ముందు కి.మీ. మేర క్యూలైన్లు కనిపించాయి. మరోవైపు మహారాష్ట్రలోనే అంబర్ నాథ్ వింకో నకాలోని ఓ పెట్రోల్ బంక్‌లో లీటరు పెట్రోలు 50 రూపాయలకే అందించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు వచ్చేవారికి ఈ సదుపాయం కల్పించారు.

No Internet connection

Link Copied