Dailyhunt
సీఎం జగన్‌తో అక్కినేని నాగార్జున భేటీ

సీఎం జగన్‌తో అక్కినేని నాగార్జున భేటీ

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో అక్కినేని నాగార్జున భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎంను నాగార్జున కలిశారు. జగన్‌తో లంచ్ చేశారు.

నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్ రెడ్డి ఉన్నారు. సినిమా పరిశ్రమ సమస్యలపై ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. సినీ పరిశ్రమకు సంబంధించి ఏదైన సమస్య ఉంటే ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు కలిసి మాట్లాడే సంప్రదాయం మొదటి నుంచి కొనసాగుతోంది. కానీ ఈసారి నాగార్జున ఒక్కరే సీఎంను కలిసి మాట్లాడడం చర్చకు దారితీసింది.

కాగా ఇటీవల సినిమా పరిశ్రమ, ఏపీ ప్రభుత్వం మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ వివాదం నేపథ్యంలో రిలీజ్ కాలేదు. ఇటువంటి వివాదం పరిశ్రమకు, ప్రభుత్వానికి మంచిదికాదని.. ముఖ్యంగా పరిశ్రమ నష్టపోతుందని భావిస్తూ సీఎం జగన్‌తో చర్చించేందుకు నాగార్జున గురువారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy