Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

టీడీపీ పొలిట్‌బ్యూరోలోకి షరీఫ్‌

అమరావతి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా శాసన మండలి మాజీ చైర్మన్‌ ఎంఏ షరీ్‌ఫను నియమించారు. సుదీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తూ అనేక బాధ్యతలు నిర్వహించిన ఆయనను పొలిట్‌బ్యూరోలోకి తీసుకోవడం ఇదే మొదటిసారి.

ఇటీవల పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న తిరుపతికి చెందిన గురజాల మాల్యాద్రిని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ నియామకాలతో పాటు టీడీపీ రాష్ట్ర కమిటీని విస్తరిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ మానవ వనరుల విభాగం (హెచ్‌ఆర్‌డీ) చైైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి బి. రామాంజనేయులు నియమితులయ్యారు. ఆయనను పార్టీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా కూడా నియమించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy