Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
100 కంటే దిగువన కోవిడ్ కేసులు.. సరికొత్త రికార్డు

100 కంటే దిగువన కోవిడ్ కేసులు.. సరికొత్త రికార్డు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బుధవారంనాడు కొత్తగా 96 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వంద కంటే తక్కువ కేసులు నమోదు కావడం గత తొమ్మిది నెలల్లో ఇదే మొదిసారి. గత 24 గంటల్లో 9 కోవిడ్ మరణాలు కూడా సంభవించాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, కొత్తగా 9 మరణాలతో ఢిల్లీలో కోవిడ్ మృతుల సంఖ్య 10,829కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 6,34,325 కాగా, కోలుకున్న వారి సంఖ్య 6,21,995 వరకూ ఉంది. కాగా, దేశవ్యాప్తంగా కొత్తగా 12,689 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,06,89,527కు చేరింది. 1,03,59,305 మంది పూర్తిగా కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 96.91కి చేరింది. కొత్తగా 137 మరణాలతో దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1,53,724కు చేరుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy