Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు!

100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు!

  • అక్టోబరులోనే మార్కెట్‌లో అందుబాటులోకి: గడ్కరీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: పూర్తిగా ఇథనాల్‌తో నడిచే కారును వచ్చే నెలలో ఆవిష్కరించనున్నట్లు కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ చెప్పారు.

పెట్రోల్‌ లీటరు రూ.25 ఉంటే ఎంత నిర్వహణ వ్యయమవుతుందో.. అంతే ఖర్చుతో ఈ కారు నడుస్తుందని చెప్పారు. అక్టోబరులో టయోటా కంపెనీకి చెందిన 'ఇన్నోవా ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌' (100 శాతం ఇథనాల్‌తో నడిచే) కారు ఆవిష్కరణ కార్యక్రమానికి తాను హాజరుకానున్నట్లు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ వెల్లడించారు. ఈ కారుకు చుక్క పెట్రోలు కూడా అవసరం లేదన్నారు. పైగా ఇది నడుస్తున్నప్పుడు ఏకంగా 60 శాతం విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 19 దేశాల్లో ఇథనాల్‌ వినియోగిస్తున్నారని, మన దేశంలోనూ ఈ20 పెట్రోలుతో నడిచే వాహనాలకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదులూ రాలేదని ఆయన స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy