Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

10న తేలనున్న విద్యుత్‌ విభజన కేసు!

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ ఉద్యోగుల విభజన వివాదం ఈనెల 10న సుప్రీంకోర్టులో తేలనుంది. విద్యుత్‌ ఉద్యోగుల విభజన అశాస్త్రీయంగా జరిగిందని నివేదిస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ విద్యుత్‌ సంస్థలు జూలై 15న క్లారిఫికేషన్‌ పిటిషన్‌ దాఖలు చేయగా...16న యూనియన్లు ఇంప్లీడ్‌ అయ్యాయి. దీంతో ఈ పిటిషన్‌పై కోర్టు తుది తీర్పు ఇవ్వనున్నది. విద్యుత్‌ ఉద్యోగుల విభజనకు విడుదల చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి డీఎం ధర్మాధికారి కేటాయింపులు చేశారని తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే విభజన వివాదాన్ని జస్టిస్‌ ధర్మాధికారి వద్దే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు తెలుగు రాష్ట్రాలకు పలుసార్లు తేల్చిచెప్పింది కూడా.

ధర్మాధికారి వద్ద ద్వారాలు మూసుకున్నతర్వాతే తమ వ ద్దకు రావాలని సుప్రీంకోర్టు గుర్తు చేయడంతో క్లారిఫికేషన్‌ పిటిషన్‌పై ఏం నిర్ణయం వెలువడనుందో అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy