Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
12 ఏళ్ల  నిరీక్షణకు తెర.. ప్రపంచ కప్‌లో ఐర్లాండ్ తొలి విజయం

12 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ కప్‌లో ఐర్లాండ్ తొలి విజయం

స్పోర్ట్స్ డెస్క్: రెండు రోజుల క్రితం ఐర్లాండ్ పురుషుల జట్టు బలమైన టీమిండియాను ఓడించి సంచలనం సృష్టించింది. ఏ ఫార్మాట్‌లోనైనా భారత్‌పై విజయం సాధించడం ఇదే తొలిసారి.

38 పరుగుల తేడాతో శ్రేయస్ అయ్యర్ సేనను ఘోరంగా ఓడించింది. తాజాగా ఐర్లాండ్ మహిళల జట్టు కూడా చరిత్ర సృష్టించింది. దాదాపు 12 ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రపంచ కప్ టోర్నీలో తొలి సారి గెలుపు రుచి చూసింది. 21 మ్యాచుల ఓటమి తర్వాత కరేబియన్ జట్టు వెస్టిండీస్‌పై విజయం సాధించింది. దీంతో విండీస్ సెమీస్ అవకాశాలు అత్యంత క్లిష్టంగా మారాయి.

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 గ్రూప్‌-బిలో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటింగ్ లైనప్ కకావికలం అయింది. చినెల్లె హెన్రీ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలించింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ (22), డియాండ్రా దొడిన్ (21) పర్వాలేదనిపించారు. ఐర్లాండ్ బౌలర్లలో కారా ముర్రే, అమీ మగూరీ చెరో 2 వికెట్లు సాధించగా.. ఓర్లా, అర్లెన్ కెల్లీ, జేన్ మాగూరీ తలా ఒక వికెట్ పడగొట్టారు.

అనంతరం 129 పరుగుల స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన ఐర్లాండ్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయ తీరాలకు చేరింది. ఓర్లా ప్రెండెగస్ట్ (63) అర్ధసెంచరీ సాధించి విజయంలో కీలకపాత్ర పోషించింది. విండీస్ బౌలర్లలో ఆశ్మిని మునిసర్ 2 వికెట్లు తీసింది. తాజాగా వెస్టిండీస్‌పై విజయంతో మహిళల టీ20 ప్రపంచకప్‌లో 21 వరుస ఓటముల తర్వాత ఐర్లాండ్ పరాజయాలకు చెక్ పెట్టింది. 2014 నుంచి 2026 మధ్య జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో ఐర్లాండ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.

తాజా ఓటమితో విండీస్ సెమీస్ చేరాలంటే మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ న్యూజిలాండ్ గెలిస్తే మాత్రం వెస్టిండీస్ ఇంటిబాట పట్టనుంది. మరో మ్యాచ్‌లో శ్రీలంక 3 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌పై గెలిచింది. మొదట స్కాట్లాండ్‌ 6 వికెట్ల కోల్పోయి 151 పరుగులు చేసింది. లంక 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

డెంబెలె హ్యాట్రిక్‌

చావో రేవో!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy