Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
12 ఏళ్లలో రూ.10 లక్షల కోట్ల బ్యాంకు రుణాల రైటాఫ్‌

12 ఏళ్లలో రూ.10 లక్షల కోట్ల బ్యాంకు రుణాల రైటాఫ్‌

న్యూఢిల్లీ: రుణాల కొట్టివేత (రైటా్‌ఫ)లు దేశంలోని బ్యాంకులకు పెద్ద గుదిబండగా మారాయి. పెద్దపెద్ద కంపెనీలు, వ్యాపార సంస్థలు కూడా తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించడం లేదు.

దీంతో గత 12 సంవత్సరాల్లో బ్యాంకులు.. ఈ కంపెనీలు, సంస్థల నుంచి రావాల్సిన దాదాపు రూ.10 లక్షల కోట్ల రుణ బకాయిలను కొట్టివేశాయి. కేంద్ర ఆర్థిక ఽశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదురి ఒక లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానంగా లోక్‌సభలో ఈ విషయం వెల్లడించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.1,48,753 కోట్ల వరకు ఉన్న ఈ కొట్టివేతలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.20,485 కోట్లకు తగ్గినట్టు తెలిపారు. ఖాతా పుస్తకాల్లో ఈ రుణాలను కొట్టివేసినా.. వాటి వసూలు కోసం బ్యాంకులు ప్రయత్నం చేస్తూనే ఉంటాయన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy