Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
14వేల పరుగులు కష్టపడకుండానే వచ్చాయా?.. విమర్శకులకు జో రూట్ కౌంటర్

14వేల పరుగులు కష్టపడకుండానే వచ్చాయా?.. విమర్శకులకు జో రూట్ కౌంటర్

ఇంటర్నెట్ డెస్క్: వరుసగా ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔట్ అవుతున్నాడంటూ వస్తున్న విమర్శలపై ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఘాటుగా స్పందించాడు. సమస్య ఏదైనా సరే పరిష్కరించుకునే సత్తా తనకు ఉందని స్పష్టం చేశాడు.

టెస్టు క్రికెట్‌లో 14 వేలకుపైగా పరుగులు చేశానని, అందుకు తన అనుభవమే నిదర్శనమని చెప్పాడు. ఇటీవల ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో రూట్ ఏకంగా ఎనిమిది సార్లు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనే మూడుసార్లు ఎల్బీడబ్ల్యూ అవ్వడం గమనార్హం. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లోనూ ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఆరుసార్లు ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.

'నేను చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నాను. ఇలాంటి సమస్యలను గతంలోనూ అధిగమించాను. దీనిని కూడా అలాగే పరిష్కరించుకుంటాను. నాకు 14 వేల పరుగులు ఊరికే రాలేదు. దీని వెనుక దాదాపు 15 ఏళ్లుకు పైగా కష్టం, శ్రమ ఉన్నాయి. అయితే ఈ వరుస వైఫల్యాలు నన్ను కూడా అసహనానికి గురి చేస్తున్నాయి. కానీ అందులో కొన్ని నిర్ణయాలు 'అంపైర్స్ కాల్' కారణంగా నాకు అనుకూలంగా రాలేదు. ఈ సమస్య నుంచి కూడా బయటపడతాను. దీనిపై నాకు పెద్దగా ఆందోళన లేదు' అని రూట్ తెలిపాడు.

కారణం ఏదైనా..!

పాకిస్థాన్‌తో జరుగుతున్న సిరీస్‌లో బ్యాటర్ల తడబాటుకు కొత్త డ్యూక్స్ బంతి కూడా ఒక కారణమని రూట్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఉపయోగిస్తున్న బంతుల్లో మార్పు కనిపిస్తోందని చెప్పాడు. 'ఈ ఏడాది బంతులు చాలా భిన్నంగా ఉన్నాయి. వాటికి వేరే రకమైన లాకర్ ఉన్నట్లు అనిపిస్తోంది. దీనిపై నా దగ్గర ఆధారాలు లేవు. డ్యూక్స్‌నే అడగాలి. బంతి త్వరగా ఆకారం కోల్పోకుండా ఉండేందుకు సీమ్‌పై ప్రత్యేకమైన లాకర్ వేసి ఉండొచ్చు' అని రూట్ పేర్కొన్నాడు. లార్ట్స్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 194 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

strong>

భారత్, బంగ్లాదేశ్ సిరీస్‪పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!

దులీప్ ట్రోఫీ 2026లో మహ్మద్ షమీ అరుదైన ఫీట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy