Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2030 నాటికి భారత ఈవీ మార్కెట్‌

2030 నాటికి భారత ఈవీ మార్కెట్‌

రూ.20 లక్షల కోట్లకు..

5 కోట్ల ఉద్యోగాల సృష్టి

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ: మన దేశ విద్యుత్‌ వాహన (ఈవీ) మార్కెట్‌ విలువ 2030 నాటికి రూ.20 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉందని, ఇదే కాలం నాటికి ఐదు కోట్ల ఉద్యోగాలను సృష్టించనుందని ఉందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు.

సీఐఐ-ఐటీసీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ సస్టెనబుల్‌ డెవల్‌పమెంట్‌ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ మాట్లాడారు. ప్రస్తుతం మన దేశంలో 57 లక్షల విద్యుత్‌ వాహనాలు రిజిస్టర్‌ అయ్యాయని, వీటి మార్కెట్‌ వాటా 7 శాతం ఉందని తెలిపారు. దేశంలో రెండు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీలైన బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్ప్‌లు తాము ఉత్పత్తి చేసే వాహనాల్లో 50 శాతానికి పైగా ఎగుమతి చేస్తున్నాయని చెప్పారు. మన దేశంలో వార్షికంగా ఒక లక్ష విద్యుత్‌ బస్సులకు డిమాండ్‌ ఉందని, కానీ మనం వార్షికంగా కేవలం 50,000-60,000 ఈవీ బస్సులను మాత్రమే తయారు చేయగలుగుతున్నామన్నారు. ఐదేళ్లలోపు భారత ఆటోమొబైల్‌ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్‌వన్‌ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందని, ఇది కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదని పేర్కొన్నారు.

వార్తలనూ చదవండి:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy