ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు
25 ఏళ్ల తర్వాత పోటా పోటీగా విజయ డైరీ ఎన్నికలు

నంద్యాల: కర్నూలు జిల్లా విజయ డైరీ ఛైర్మన్ ఎన్నికలు అధికార, ప్రతిపక్షాలకు ఛాలెంజ్‌గా మారాయి. 25 ఏళ్లుగా భూమా కుటుంబం చేతిలో ఉన్న ఆ డైరీని చేజిక్కించుకోవడం కోసం ప్లాన్‌లు వేస్తున్నారు. రాష్ట్రమంతా ఫ్యాన్స్ గాలి వీస్తున్న నంద్యాలలో మాత్రం పాగా వేయలేకపోయారు. ఇప్పుడు విజయ డైరీని సొంతం చేసుకునే దిశగా అధికార పక్షం అష్టకష్టాలు పడుతోంది.
నంద్యాల విజయ డైరీలోని మూడు డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఓటర్లు 81 మంది సభ్యులు ఉండగా.. ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. బుధవారం ఉదయం 9 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అనంతరం ఛైర్మన్ స్థానానికి ప్రత్యక్ష ఎన్నిక నిర్వహిస్తారు.
కాగా ఈ ఎన్నికలను మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత 25 ఏళ్లుగా భూమా కుటుంబానికి ఏకగ్రీవంగా ఛైర్మన్ పదవి దక్కుతూ వస్తోంది. భూమా నాగిరెడ్డి చిన్నాన్న భూమా నారాయణరెడ్డి ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. అయితే ఈసారి వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని జిల్లా ఎమ్మెల్యేలకు సీఎం జగన్ టార్గెట్ పెట్టారు. పోటీ అనివార్యం కావడంతో ఛైర్మన్ అభ్యర్థి బరిలో అఖిల ప్రియ మేనమామ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో అన్నదానిపై ఉత్కంఠ నెలకోంది.
related stories
-
ప్రకాశం సిపిఎం అభ్యర్థుల విస్తృత ప్రచారం
-
జిల్లా వార్తలు స్వతంత్రుల సవాల్..!
-
జిల్లా వార్తలు టిడిపి అభ్యర్థుల ప్రచార జోరు