Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
27 ఏళ్లకే ఆటకు వీడ్కోలు.. తాను చదువుకున్న స్కూలే కారణమంటూ..

27 ఏళ్లకే ఆటకు వీడ్కోలు.. తాను చదువుకున్న స్కూలే కారణమంటూ..

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ విల్ పుకోవిస్కీ 27 ఏళ్ల వయసులోనే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. జాతీయ జట్టు తరఫున కేవలం ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 36 మ్యాచ్‌లు ఆడాడు. అయితే వరుసగా ఎదురైన కంకషన్ (తలకు బలమైన దెబ్బ కారణంగా మెదడుపై ప్రభావం) గాయాలతో అతడి క్రికెట్ కెరీర్ అర్ధంతరంగా ముగిసింది. తాజాగా తన కెరీర్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిన తొలి కంకషన్ ఘటనకు సంబంధించి పుకోవిస్కీ తాను చదువుకున్న పాఠశాలపై న్యాయపోరాటానికి దిగాడు. తన కెరీర్ ఇలా అవ్వడానికి కారణం స్కూలేనని ఆరోపిస్తూ తాజాగా దావా వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మెల్‌బోర్న్‌లోని బ్రైటన్ గ్రామర్ స్కూల్‌లో విల్ విద్యనభ్యసించాడు. 2014లో ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్‌బాల్ ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొన్నాడు. అప్పుడు అతడి వయసు 16 ఏళ్లు. ఆ ఫుట్‌బాల్ సెషన్‌లో విల్ తలకు గాయమైంది. 'ఆ సమయంలో స్కూల్ యాజమాన్యం సరైన వైద్యం అందించలేదు. దెబ్బ తగిలిన కొద్ది నిమిషాలకే తిరిగి శిక్షణలోకి పంపిచారు. ఆ గాయం ప్రభావంతో నేను కొన్ని నెలల పాటు స్కూల్‌కు కూడా వెళ్లలేదు. అందుకే క్రికెట్ కెరీర్‌లో పలుమార్లు గాయాలబారిన పడాల్సి వచ్చింది' అని విల్ ఆరోపించాడు.

కెరీర్‌లో 13 కంకషన్లు!

ఆ తొలి గాయం తర్వాత విల్ కెరీర్‌లో కంకషన్లు వెంటాడాయి. క్రికెట్ ఆడుతున్న సమయంలో అతడికి 13 కంకషన్లు నమోదయ్యాయి. చివరకు 2024లో స్వతంత్ర వైద్య నిపుణుల బృందం క్రికెట్ నుంచి తప్పుకోవాలని సిఫారసు చేయడంతో 27 ఏళ్ల వయసులోనే అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు.

strong>

కుర్రాళ్ల భవిష్యత్తుకే మంచిది కాదు.. ఐసీసీ, బీసీసీఐ చర్యలు తీసుకోవాలి: సంజయ్ మంజ్రేకర్

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో స్టార్క్.. రెండో స్థానానికి పడిపోయిన బుమ్రా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy