Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
33 మ్యాచుల్లో 100 గోల్స్ .. 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా...

33 మ్యాచుల్లో 100 గోల్స్ .. 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా...

స్పోర్ట్స్ డెస్క్: ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026 టోర్నమెంట్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. గత 68 ఏళ్ల ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా 100 గోల్స్ మైలురాయిని ఈ ఎడిషన్ దాటేసింది.

కేవలం 33 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇవాళ(ఆదివారం) స్వీడన్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్‌లో డచ్ ఆటగాడు కోడి గ్యాక్‌పో జట్టు తరఫున మూడో గోల్ సాధించడంతో ప్రస్తుత టోర్నీలో 33 మ్యాచుల్లోనే గోల్స్ సంఖ్య 100కు చేరింది.

జూన్ 12న జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై మెక్సికోకు చెందిన జూలియన్ క్వినోనెస్ ఈ ప్రపంచకప్‌లో మొట్టమొదటి గోల్ నమోదు చేయగా.. కేవలం 10 రోజుల్లోనే 33వ మ్యాచ్‌ నాటికి 100వ గోల్ రావడం గమనార్హం. ఇదివరకు 1982, 2014 టోర్నీలలో 100 గోల్స్ మార్కును చేరుకోవడానికి 36 మ్యాచ్‌లు పట్టింది. అలానే 1978, 1994లలో 38 మ్యాచ్‌ల్లో 100 గోల్స్ మైయిరాయి చేరింది. కాగా, ఈ ఆల్‌టైమ్ రికార్డు 1954లో స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్ పేరిట ఉంది. అప్పట్లో కేవలం 20 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ నమోదయ్యాయి.

మరోవైపు ఈ మ్యాచ్‌ ద్వారా నెదర్లాండ్స్ జట్టు సరికొత్త మైలురాయిని అందుకుంది. ప్రపంచకప్ చరిత్రలో 100 గోల్స్ పూర్తి చేసుకున్న ఎనిమిదో దేశంగా డచ్ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. స్వీడన్‌తో జరిగిన మ్యాచ్ ప్రారంభమైన ఐదో నిమిషంలోనే గ్యాక్‌పో ఇచ్చిన అద్భుత పాస్‌ను బ్రాబీ గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత 17వ నిమిషంలో బ్రాబీ కొట్టిన రెండో గోల్.. ప్రపంచకప్‌ల చరిత్రలో నెదర్లాండ్స్ జట్టుకు వందో గోల్‌ కావడం విశేషం. మొత్తానికి లీగ్ దశలోనే ఫార్వర్డ్ ఆటగాళ్లు చెలరేగిపోతుండటంతో ఈసారి మెగా టోర్నీ గోల్స్ వర్షంతో అభిమానులను అలరిస్తోంది.

'మమ్మల్ని తొక్కేస్తున్నారు'.. యూఎస్‌ తీరుపై ఇరాన్‌ కోచ్‌ ఘలానెయి తీవ్ర అసంతృప్తి

వైభవ్ సూర్యవంశీ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy