Dailyhunt

4నెలలకే చినిగిన సోఫా సెట్‌

వారెంటీ ఇచ్చేందుకు నిరాకరించిన సంస్థ

రూ.25 వేల పరిహారం చెల్లించాలని 'ఫోరం' తీర్పు

హైదరాబాద్‌ సిటీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): సోఫాను సరిగ్గా మెయిన్‌టైన్‌ చేయలేదని ఆరోపిస్తూ వారెంటీ ఇచ్చేందుకు నిరాకరించిన హోం సెంటర్‌ సంస్థ తీరును వినియోగదారుల ఫోరం తప్పుబట్టింది. కొన్న వస్తువుకు వారెంటీ లేదా గ్యారెంటీ ఇవ్వకపోవడాన్ని సేవా లోపంగా గుర్తించింది. వినియోగదారున్ని మానసిక వేదనకు గురిచేసినందుకు రూ.25 వేల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. కాకతీయహిల్స్‌కు చెందిన నయాతీరెడ్డి హోం సెంటర్‌లో 3+2 సీటర్‌ సోఫాను కొన్నారు. దానికి ఏడాది వారెంటీ ఇచ్చారు. సోఫా 4 నెలల్లో చిరిగింది.

రిపేర్‌ కోసం ప్రయత్నించినా ఎవరూ వచ్చి చేయలేదు. దీంతో బాధితురాలు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy