Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
7.8 శాతం వృద్ధి రేటు.. దేశ ప్రజలకు అభినందనలు: ప్రధాని మోదీ

7.8 శాతం వృద్ధి రేటు.. దేశ ప్రజలకు అభినందనలు: ప్రధాని మోదీ

ఇంటర్నెట్ డెస్క్: భారత్ సాధించిన వృద్ధి రేటు దేశ సమష్టి శక్తికి నిదర్శనమని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నిరాశావాదులు మాత్రం తమ అసత్యాలను వ్యాప్తి చేస్తూనే ఉన్నారని విమర్శించారు.

యుద్ధాలు, సరఫరా వ్యవస్థల్లో అడ్డంకుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ మెరుగైన వృద్ధి రేటు సాధించిందని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత దేశ జీడీపీ ఏకంగా 7.8 శాతం మేర వృద్ధి చెందిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు అభినందనలు చెప్పారు. 7.8 శాతం వృద్ధి రేటు నమోదవడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోందని అన్నారు. దేశ ప్రజల పట్టుదల, శక్తిసామర్థ్యాలు గొప్పవని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు నెలకొన్నా భారత్ వృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు.

భారత దేశ ప్రగతిని ఇలాగే కొనసాగించాల్సిన అవనరం ఉందని కూడా ప్రధాని చెప్పారు. ఆత్మనిర్భరత సాధించడం అవసరమని మరోసారి చెప్పారు. స్వదేశీ వస్తువులకు దేశ ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనవసర విదేశీ పర్యటనలు, బంగారం కొనుగోళ్లు వద్దని అన్నారు. విదేశీ మారకనిల్వల పొదుపు కోసం భారత్‌లోనే వివాహాది శుభకార్యాలు జరుపుకోవాలని సూచరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy