Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
9 నెలల్లో పెన్‌గంగ లిఫ్ట్‌ సిద్ధం!

9 నెలల్లో పెన్‌గంగ లిఫ్ట్‌ సిద్ధం!

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు శుభవార్త. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ల్లో పెన్‌గంగ నదిపై నిర్మిస్తున్న చనాకా కొరాటా ఎత్తిపోతల పథకం నిర్మాణం తుదిదశకు చేరుకుంటోంది.

రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా దీన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఎగువన రెండు బ్యారేజీలను మహారాష్ట్ర నిర్మించాల్సి ఉండగా అవి ఇంకా మొదలుపెట్టలేదు. తెలంగాణ మాత్రం తనవాటా కింద అప్పజెప్పిన మూడోబ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేస్తోంది. ఐదు పంపులకు గాను రానున్న నవంబరు కల్లా రెండు పంపుల పనులను పూర్తి చేయాలని అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ప్రాజెక్టులో భాగంగా 0.8 టీఎంసీల సామర్థ్యంతో 23 గేట్లతో బ్యారేజీ కట్టేశారు. లోయర్‌ పెన్‌గంగాకు వరద ప్రవా హం అధికంగా ఉండటంతో గేట్లన్నీ ఎత్తివేసి, 15 వేల క్యూసెక్కుల వరదను గోదావరిలోకి వదిలేస్తున్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా 13,50ఎకరాలకు, గ్రావిటీ కాలువ ద్వారా 48 వే ల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. 80 కిలోమీటర్ల కాలువలో 49 కిలోమీటర్ల వద్ద ఐదు పంపులతో నీటిని ఎత్తిపోస్తా రు. ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు మండలాలకు తాగునీటిని కూడా అందిస్తారు. మూడు రోజులుగా నీటి పారుదల శాఖ ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి చనాకా కొరాటా వద్దే ఉంటూ పంప్‌హౌస్‌ పనులను పర్యవేక్షించారు.

సీడబ్ల్యూసీలో డీపీఆర్‌

ప్రాజెక్టుకు అనుమతినివ్వాలని కోరుతూ డీపీఆర్‌ను హైదరాబాద్‌లోని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) కార్యాలయంలో సమర్పించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy