Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
90వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొంటాం

90వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొంటాం

జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చంద్రప్రకాశ్‌

రాజాపురంలో కొనుగోలు కేంద్రాల పరిశీలన

అన్నపురెడ్డిపల్లి, ఏప్రిల్‌ 22: జిల్లాలో కేంద్రాల ద్వారా 90వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చంద్రప్రకాశ్‌ పేర్కొన్నారు. గురువారం రాజాపురంలో ఎర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో తేమశాతం సరిగా ఉన్న ధాన్యాన్ని ఎందుకు కాంటాలు వేయలేదని గుంపెన సీఈవో వెంకటేశ్వర్లుపై ఆగ్రహం వ్యక్తం చే శారు. ధాన్యం కొనుగోళ్లల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లా డుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 125 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు.

దాదాపు 300మెట్రిక్‌ ట న్నుల ధాన్యాన్ని సేకరించామని వివరించారు. తేమశాతం 17శాతం ఉండి తాలు లేని నాణ్యమైన ధాన్యాన్ని మాత్ర మే రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ భద్రకాళి, ఏవో అనూష, మండల రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్‌ శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy