అనంతపురం: రాయదుర్గంలో టీడీపీ కార్యకర్తలతో టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందోనన్న అనుమానం వైసీపీ నేతల్లో ఉందన్నారు. వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం లేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలున్నాయన్నారు.

