Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ రోతను భరించలేకపోయా.. రైల్వే ప్రయాణికుడి పోస్టు వైరల్

ఆ రోతను భరించలేకపోయా.. రైల్వే ప్రయాణికుడి పోస్టు వైరల్

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల రైల్లో తనకు దారుణ అనుభవం ఎదురైందంటూ ఒక వ్యక్తి నెట్టింట పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. తన సమీపంలోని సీటులో ఉన్న ఒక ప్యాసింజర్ సీటు పక్కనే చెత్త వేస్తున్న తీరు రోత పుట్టించిందని అన్నారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు.

'నాకు సమీపంలో కూర్చున్న ఒక ప్యాసింజర్ దాదాపు 8 గంటల పాటు రైల్లో చెత్త పోశాడు. ప్రయాణ సమయంలో అతడు తింటూ ఖాళీ ప్యాకెట్లు, ర్యాపర్లను సీటు పక్కన పడేశాడు. డస్ట్‌బిన్ అతడి సీటుకు కొద్ది దూరంలోనే ఉన్నా అతడు పట్టించుకోలేదు. అక్కడి దృశ్యం రోత పుట్టించేలా ఉంది. ఆ తరువాత అందరూ నిద్రపోతున్న సమయంలో అతడు పెద్ద శబ్దంతో మొబైల్‌లో వీడియో గేమ్స్ ఆడాడు' అని ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు.

'అతడికి బుద్ధి వచ్చేలా చేద్దామనుకున్నాను. కానీ చివరకు వెనక్కు తగ్గాను. అపరిచితుడికి జ్ఞానబోధ చేయడంతో ప్రయోజనం లేదని అనిపించింది. ఇలాంటి విషయాల్లో కాస్త ప్రాక్టికల్‌గా ఉండాలి. పౌర స్పృహ లేని ప్రతి వ్యక్తినీ ప్రశ్నిస్తూ వెళితే దేశంలో మార్పు రాదు. ఇలాంటి వాళ్లు తమ తప్పును సరిదిద్దుకోకుండా ఎదురు ప్రశ్నిస్తారు. తగాదాకు దిగుతారు. ఒక్కోసారి పరిస్థితి హింసాత్మక మలుపు తిరిగే ఛాన్స్ కూడా ఉంది. అందుకే మిన్నకుండిపోయాను. నాకూ కుటుంబం ఉంది. నేను సేఫ్‌గా ఇంటికి వెళ్లాలిగా' అని తన పోస్టు ముగించారు.

ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. ఇలాంటి సందర్భాల్లో రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయాలని పలువురు సూచించారు. ఇలాంటి వారి గురించి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే వెంటనే సమస్య పరిష్కారమైపోతుందని అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఫొటోల కోసం ఫోజులిస్తే.. అలలు ప్రాణాలు తీశాయి.. వీడియో వైరల్

నేరేడు పళ్లు విరగ కాస్తున్నాయి.. ఇది కరువుకు సంకేతమా..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy