Friday, 16 Apr, 4.29 am ఆంధ్రజ్యోతి

బిజినెస్
ఆ 'టైం'లో ఆర్టీజీఎస్ లావాదేవీలు జరగవు... ఆర్‌బీఐ

ముంబై : అధిక మొత్తాల్లో లావాదేవీల కోసం జరిపే 'ఆర్టీజీఎస్(రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్)' సేవల్లో అంతరాయమేర్పడనుంది. శనివారం అర్ధరాత్రి 12 గంటల నుండి ఆదివారం(ఏప్రిల్ 18) మధ్యాహ్నం 2 గంటల వరకు... మొత్తం 14 గంటల పాటు ఈ సేవలు అందుబాటులో ఉండబోవని ఆర్బీఐ గురువారం ట్వీట్ చేసింది. సాంకేతిక సమస్యల నేపధ్యంలో ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది.

'ఈ నెల 17 న బిజినెస్ సమయం ముగిసిన తర్వాత ఆర్‌టీజీఎస్ వ్యవస్థలో సాంకేతికంగా కొత్త మార్పులు చేపడుతున్నాం. ఈ నేపధ్యంలో ఏప్రిల్ 18 వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవు. నెఫ్ట్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి' అని ఆర్బీఐ పేర్కొంది.

రూ. 2 లక్షలు, అంతకంటే పైబడిన లావాదేవీలకు ఆర్టీజీఎస్సేవలను ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. అయితే, ఇందులోని డిజాస్టర్ రికవరీ టైంను మెరుగుపరచేందుకు ఆర్టీజీఎస్ సాంకేతిక వ్యవస్థలో ఆర్బీఐ మార్పులు చేపట్టింది. గతేడాది డిసెంబరు 14 నుండి ఆర్టీజీఎస్ సేవలను ఆర్బీఐ '24×7' అందుబాటులోకి తెచ్చింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top