Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ విషయంలో వైసీపీ పాత్ర ఉంది: రామకృష్ణ

ఆ విషయంలో వైసీపీ పాత్ర ఉంది: రామకృష్ణ

అమరావతి: విశాఖ స్టీల్‌ను ప్రైవేటుపరం చేస్తామని కేంద్రం ప్రకటించడం దుర్మార్గమని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎంపీ సత్యనారాయణ ప్రశ్నకు విశాఖ ఉక్కును అమ్మేస్తున్నట్లు.. పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారని చెప్పారు. రాష్ట్రానికి వాటాలు లేవని, స్టీల్ ప్లాంట్ అమ్మకంపై ఇప్పటికే.. జగన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని సీతారామన్ చెప్పారన్నారు.ఈ విషయాన్ని బట్టి ఏపీకి జరిగే ద్రోహంలో జగన్ ప్రభుత్వానికి కూడా పాత్ర ఉందన్నారు. ఏపీ బీజేపీ నేతలకు సిగ్గుంటే తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రామకృష్ణ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy