మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమా టీజర్ కోసం ఎదురుచూస్తున్న మెగాభిమానులకు ప్రేక్షకులకు చిత్ర యూనిట్ అదిరిపోయే అప్‌డేట్ అందించిన సంగతి తెలిసిందే. జనవరి 29 (శుక్రవారం) సాయంత్రం టీజర్ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను తయారు చేసి విడుదల చేసింది కూడా. అయితే ఈ టీజర్‌కు సంబంధించి మెగా ప్రిన్స్ మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌ను ఇచ్చారు. అదేంటంటే.. వరుణ్ పోస్ట్ చేసిన ఓ కామెడీ పోస్ట్‌లో "'ఆచార్య' టీజర్‌లో రామ్‌చరణ్ వాయిస్ అంటగా.. బయట టాక్' అని ఉంది. దీన్ని చూసినవారు వరుణ్‌తేజ్.. 'ఆచార్య' టీజర్‌కు చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడని కన్‌ఫర్మ్ చేస్తున్నారు.
మరి నిజా నిజాలు తెలియాలంటే జనవరి 29 వరకు ఆగాల్సిందే. ఈ చిత్రంలో సిద్ధ అనే పవర్‌ఫుల్ పాత్రలో రామ్‌చరణ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

