కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌లో మీడియా స్వేచ్ఛను అణచివేసేందుకు తాలిబన్లు కొత్త నిబంధనలను ప్రకటించారు. ఇస్లాంకు వ్యతిరేకమైన, జాతీయ స్థాయి నేతలకు అవమానకరమైన అంశాలను ప్రచురించరాదని పేర్కొన్నారు.
అమెరికాలోని ప్రెస్ ఫ్రీడం ఆర్గనైజేషన్ సీనియర్ మెంబర్ స్టీవెన్ బట్లర్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్‌లో పాత్రికేయులు భయపడుతున్నారని చెప్పారు. సహాయం కోరుతూ వందలాది ఈ-మెయిల్స్ ఆఫ్ఘన్ పాత్రికేయుల నుంచి తమకు వస్తున్నాయన్నారు.
అమెరికన్ మీడియా కథనం ప్రకారం, ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వం కుప్పకూలినప్పటి నుంచి దాదాపు 150 మీడియా సంస్థలు మూతపడ్డాయి. రోజువారీ కార్యకలాపాలు నిర్వహించలేక ఈ సంస్థలను మూసేశారు. మీడియాకుగల సమాచార హక్కులో తాలిబన్లు నిరంతరం జోక్యం చేసుకోవడమే దీనికి కారణం. కొన్ని దిన పత్రికలు ముద్రణను నిలిపేసి, కేవలం ఆన్‌లైన్‌లోనే తమ పత్రికలను ప్రచురిస్తున్నాయి. దేశంలో అకస్మాత్తుగా ఆర్థిక వ్యవస్థ తలక్రిందులు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
మానవీయ విలువలను గౌరవిస్తామని ఇచ్చిన హామీని తాలిబన్లు నిలబెట్టుకోవడం లేదని స్థానిక పాత్రికేయులు ఆరోపిస్తున్నారు. పాత్రికేయులను నిరంతరం వేధిస్తున్నారని, చంపుతున్నారని పేర్కొన్నారు. తాలిబన్ల వశంలోకి ఆఫ్ఘనిస్థాన్ వెళ్ళినప్పటి నుంచి ప్రైవేట్ టీవీ చానళ్ళలో ప్రసారాల తీరు మారిపోయింది. విమర్శలు, రాజకీయ చర్చలు, వినోదం, సంగీతం, విదేశీ సీరియల్స్ వంటివాటికి బదులుగా తాలిబన్ ప్రభుత్వానికి అనుకూలమైన అంశాలను ప్రసారం చేస్తున్నాయి.
అఫ్ఘాన్ సుస్థిర భవిష్యత్తులో.. భారత్ సహా ఆ దేశాలకు భాగస్వామ్యం: బైడెన్
మీడియా బాధ్యతాయుతంగా ఉండాలి : సీజేఐ
Afghanistan: తాలిబాన్లే లక్ష్యంగా బాంబుపేలుళ్లు
జీవితాంతం గుర్తుండిపోయేలా భారీ ఓటమిని వాళ్లకు గిఫ్ట్‌గా ఇస్తా.. ట్రంప్ కామెంట్స్

