Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆగస్టు 5న లాక్‌డౌన్ ఎత్తేయండి: బీజేపీ నేత విజ్ఞప్తి

ఆగస్టు 5న లాక్‌డౌన్ ఎత్తేయండి: బీజేపీ నేత విజ్ఞప్తి

కోల్‌కతా: మరో రెండు రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగనున్న నేపధ్యంలో పశ్చిమ బెంగాల్‌లో విధించిన లాక్‌డౌన్‌ను ఆగస్టు 5న పూర్తి స్థాయిలో విరమించుకోవాలని ప్రభుత్వానికి ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విజ్ఞప్తి చేశారు.

ఆగస్టు 5న ప్రముఖులంతా కలిసి అయోధ్యలో భూమిపూజ చేయనున్నారు. అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులో ఉండడం వల్ల.. బెంగాల్ నుంచి అయోధ్య వెళ్లేందుకు అనుమతులు లభించడం లేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు 5న లాక్‌డౌన్లో సడలింపులు చేస్తే బెంగాల్ నుంచి అయోధ్యకు వెళ్లేందుకు సులభ వాతావరణం ఏర్పడుతుందని దిలీప్ ఘోష్ అన్నారు.

బెంగాల్‌లో కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 80 వేలకు చేరువలో ఉంది. ఇక మరణాల సంఖ్య కూడా 1600 మార్కును దాటింది. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడం కాస్త ఊరటనిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy