ఇప్పటివరకు లవర్‌బాయ్ తరహా పాత్రల్లో కనిపించిన యంగ్ హీరో రాజ్‌తరుణ్ రూటు మార్చాడు. ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో నటించాడు. రాజ్‌తరుణ్, హేమల్ హీరో హీరోయిన్లుగా విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `పవర్ ప్లే`. మార్చి 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. హీరోకు ఎదురైన పరిస్థితులు, వాటి నుంచి అతను ఎలా బయటపడ్డాడనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. సస్సెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నటి పూర్ణ ఓ కీలక పాత్ర చేసింది. వనమాలి ప్రొడక్షన్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది.

