Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆక్సీజన్‌ కొరత రాకుండా నిరంతర పర్యవేక్షణ- మంత్రి ఈటల

ఆక్సీజన్‌ కొరత రాకుండా నిరంతర పర్యవేక్షణ- మంత్రి ఈటల

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా రోగులకు అవసరమైన ఆక్సీజన్‌ కొరత లేకుండా తాను, మంత్రి కేటీఆర్‌, ఐఏఎస్‌ అధికారుల బృందం నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కాబట్టే మన వద్ద ప్రభుత్వ ఆస్పత్రుల్లో లిక్విడ్‌ ఆక్సీజన్‌ బ్యాంక్‌లు ఉన్న దగ్గర ఇబ్బంది రావడం లేదు. సిలిండర్‌ల విషయంలో కొంత కొరత ఉందని ఆయన తెలిపారు. గురువారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కొంత మంది కావాలనే కొరత సృష్టిస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నవారు అయినా ప్రజలే. వివక్ష చూపవద్దని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు.

మా దగ్గర తయారయిన ఇంజెక్షన్‌లు, వ్యాక్సిన్‌లు మేమే వాడుకుంటాం అని చెప్పవచ్చు. కానీ మేము అంత సంకుచితంగా లేమని ఈటల స్పష్టం చేశారు. కరోనా నియంత్రణ వ్యాక్సిన్‌ ద్వారానే అని తెలిసినప్పుడు ముందుగానే ఉత్పత్తి పెంచాల్సింది. కానీ కేంద్రం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు వ్యవహరించిందని విమర్శించారు. మనం ఇచ్చిన సలహాలు సూచనలు పక్కనబెట్టింది,. ముందే స్పందించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు కేటీఆర్‌, సీఎం కేసీఆర్‌ మన దగ్గర ఉన్న అన్నికంపెనీలతో వ్యాక్సిన్‌ ప్రొడక్షన్‌ పెంచమని కోరాం. కానీ కేంద్రం నియంత్రించిందని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ఆక్సీజన్‌, రెమిడేస్వీర్‌ ఇంజక్షన్‌లను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కమిట్‌మెంట్‌కు కేంద్రం తోడు కావాలని విజ్ఞప్తి చేశారు.

ఇక కరోనా టెస్టుల విషయానికి వస్తే ఆర్‌టిపీసీఆర్‌ చేయడానికి 104 కేంద్రాల్లో 30వేల పరీక్షలుచేస్తున్నాం. మిగిలినవి అన్నీ రాపిడ్‌ చేస్తున్నాం. అవసరం అయితే రోజుకు 2లక్షల పరీక్షలు కూడా చేస్తామని మంత్రి ఈటల తెలిపారు. రాపిడ్‌లో పాజిటివ్‌ వస్తే ఖచ్చితంగా పాజిటివ్‌ కాబట్టి లక్షణాలు లేని వారంతా హోమ్‌ ఐసోలేషన్‌ ఉండాలన్నారు. ఒక వేళ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వచ్చి పరీక్ష చేయించుకోవాలని చెప్పారు. ఏం కాదులో అని ఇంట్లో ఉంటే వారికి వైరస్‌ తీవ్రత ఎక్కువవుతుందన్నారు. అలాంటప్పుడు వెంటిలేటర్‌ దొరకడం, దొరికినా బ్రతకడం కష్టం అవుతుందన్నారు. కాబట్టితాత్సారం చేయొద్దని మంత్రి పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy