ముంబై: కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దేశంలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. కోవిడ్ బారిన పడిన వారికి సరిగా ఆక్సీజన్ లభించడం లేదని, ఆసుపత్రుల్లో బెడ్లు దొరకడం లేదనే వార్తలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఈ పరిస్థితికి పూర్తి కారణం రాజకీయ నేతలేనని బాలీవుడ్ హీరో సునిల్ శెట్టి తీవ్ర విమర్శలు గుప్పించారు. వాళ్లే మనల్ని ఆసుపత్రుల్లో బెడ్ల కోసం, ఆక్సీజన్ కోసం పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో చూసుకుని ఓటేయాలంటూ సునిల్ శెట్టి వ్యాఖ్యానించడం గమనార్హం.
''ఈ ఎన్నికల్లో గెలిచాం కదా అని పని చేయకుండా వచ్చే ఎన్నికల కోసమే ఆలోచిస్తున్నారు. ప్రతి రాజకీయ నాయకుడూ ఇంతే.
