Dailyhunt

ఆల్‌రౌండర్‌ గ్రీన్‌కు చోటు

భారత్‌తో సిరీ్‌సకు ఆసీస్‌ జట్టు

మెల్‌బోర్న్‌: టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీ్‌సకు ఆస్ట్రేలియా జట్టును గురువారం ప్రకటించారు. యువ ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌కు తొలిసారి జాతీయ జట్టులో చోటు కల్పించారు. ఇక మూడేళ్ల విరామం తర్వాత మోజెస్‌ హెన్రిక్స్‌కు పిలుపు లభించింది. ఆస్ట్రేలియాతో మూడేసి వన్డేలు, టీ20లలో భారత్‌ తలపడనుంది. 18 మంది సభ్యుల జట్టులో ప్రధానంగా బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్లకు ఆసీస్‌ ప్రాధాన్యమిచ్చింది.

వన్డే, టీ 20 జట్టు: ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, సీన్‌ అబాట్‌, ఆస్టన్‌ అగర్‌, అలెక్స్‌ కేరీ, పాట్‌ కమిన్స్‌ (వైస్‌-కెప్టెన్‌), కామెరాన్‌ గ్రీన్‌, హాజెల్‌వుడ్‌, మోసెస్‌ హెన్రిక్స్‌, లబుషేన్‌, మ్యాక్స్‌వెల్‌, డానియల్‌ సామ్స్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, స్టార్క్‌, స్టొయినిస్‌, మాథ్యూ వేడ్‌, జంపా.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy