Dailyhunt

ఆనాడు చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చాలన్నారు తప్పులేదా?: జడ్జి రామకృష్ణ

తిరుపతి: ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై తీవ్రవ్యాఖ్యలు చేసిన జడ్జి రామకృష్ణను మదనపల్లెలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నంద్యాల ఉపఎన్నికల్లో జగన్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నడిరోడ్డుపై కాల్చి చంపాలని అన్నారని.. ఇప్పుడు తాను అదే విధంగా అన్నానని చెప్పారు. జగన్ అప్పటి ముఖ్యమంత్రికి అన్న వ్యాఖ్యలు తప్పుకానప్పుడు తాను ఇప్పుడు సీఎం జగన్‌ను అంటే దేశ ద్రోహం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కాగా జడ్జి రామకృష్ణ బీ కొత్తకోట నుంచి మదనపల్లెలో కరోనా టెస్ట్ కోసం వెళుతుండగా దారి మధ్యలో పోలీసులు అదుపులోకి తీసుకొని పీలేరు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు పరచనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy