Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆందోళనలో కమల్ అభిమానులు... వివరణ ఇచ్చిన స్టార్‌

ఆందోళనలో కమల్ అభిమానులు... వివరణ ఇచ్చిన స్టార్‌

దక్షిణాది సీనియర్ అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌కు కరోనా వైరస్ సోకింది అంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కమల్‌లో కరోనా లక్షణాలు కనిపించాయని, ఆయన ఇంటి బయట కూడా నోటీసు ఉందని వార్తలు వినపడుతున్నాయి. వైద్యుల సూచన మేరకు కమల్ స్వీయ నిర్భంధనలో ఉన్నారని వచ్చిన వార్తలపై కమల్‌హాసన్ స్పందించారు. అవన్నీ రూమర్స్ అంటూ కమల్ స్పష్టం చేయడంతో అభిమానులు రిలాక్స్ అయ్యారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని కమల్ సూచించారు. ఇటీవల తమ కుటుంబం అంతా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉందని శృతిహాసన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy