Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆంటారియో సరస్సు పేరు మార్పు.. ట్రంప్‌ తీరుపై కెనడా నేతల వ్యంగ్యాస్త్రాలు

ఆంటారియో సరస్సు పేరు మార్పు.. ట్రంప్‌ తీరుపై కెనడా నేతల వ్యంగ్యాస్త్రాలు

ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'లేక్ ఆంటారియో' పేరును 'లేక్ అమెరికా'గా మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై కెనడా నేతలు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.

ఆంటారియో ప్రీమియర్ డౌగ్ ఫోర్డ్ శనివారం కెనడా తీరప్రాంతంలో రెండు అంతస్తుల ఎత్తున్న భారీ సైన్ బోర్డును ఏర్పాటు చేశారు. దానిపై 'లేక్ ఆంటారియో.. ఇప్పుడు.. ఎల్లప్పుడూ' అని రాసి ట్రంప్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ వీడియో డౌగ్ ఫోర్డ్ మాట్లాడుతూ.. 'ట్రంప్ పదవి ముగిసి వెళ్లిపోయిన చాలా కాలం తర్వాత కూడా దీనిని లేక్ ఆంటారియో అనే పిలుస్తారు' అని పేర్కొన్నారు.

మానిటోబా ప్రీమియర్ వాబ్ కినూ ట్రంప్ వైఖరిని ముసలి రాక్ బ్యాండ్‌తో పోల్చారు. 'వయసు పైబడిన రాక్ బ్యాండ్ వాళ్లు క్యాసినోలలో 50 ఏళ్ల నాటి పాత పాటలను పాడుతూ పాపులర్ అవ్వాలని చూస్తుంటారు. ట్రంప్ పరిస్థితి కూడా అలాగే ఉంది. గతంలో మెక్సికో గల్ఫ్‌ను 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మార్చి హిట్ కొట్టామనుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే పాత ట్రిక్కును తన ఓటర్ల కోసం ఇక్కడ ప్లే చేస్తున్నారు. ఇది చాలా విచారకరం' అని ఎద్దేవా చేశారు.

>

దాల్‌ కీ దుల్హన్‌.. తయారు చేసుకోండిలా..

పుచ్చకాయతో వంటకాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy