Dailyhunt
ఆప్‌లో చేరిన మిస్ ఇండియా ఢిల్లీ

ఆప్‌లో చేరిన మిస్ ఇండియా ఢిల్లీ

న్యూఢిల్లీ: మిస్ ఇండియా ఢిల్లీ 2019 మాన్సి సెహెగల్ సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. పార్టీ నేత, ఢిల్లీ జల్ బోర్డు చైర్మన్ రాఘవ్ చద్దా ఆమెను ఆప్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాఘవ్ చద్దా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పాలనలో ఢిల్లీ ఎంతో అభివృద్ధి చెందుతోందని, ఈ అభివృద్ధిని దగ్గరనుంచి చూడడం వల్లనే మాన్సి ఆప్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. పార్టీలో చేరిన అనంతరం మాన్సి మాట్లాడుతూ.. యువత, మహిళలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే మాన్సి సెహెగల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేశారు.

2019లో జరిగిన ఎఫ్‌బీబీ కలర్స్ ఫెమినా మిస్ ఇండియా ఢిల్లీ విజేతగా నిలిచారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy