దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'రౌద్రం రణం రుధిరం' (ఆర్‌ఆర్‌ఆర్). భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి. దానికి తగ్గట్టే మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడటంలేదు జక్కన్న. ఈ సినిమా క్లైమాక్స్ పార్ట్ ఓ రేంజ్‌లో ఉండాలని ఏకంగా హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్‌నే రంగంలోకి దింపాడు. ఈ విషయం ఆర్‌ఆర్‌ఆర్ డైరీస్ అంటూ చిత్రయూనిట్ అధికారికంగా ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్ర బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరుగుతున్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి.
ముఖ్యంగా ఈ చిత్ర డిజిటల్ రైట్స్ కనీవినీ ఎరుగని రీతిలో బిజినెస్ అయినట్లుగా తెలుస్తుంది.

