Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆరెంజ్‌ తోటల రైతులకు నీటి ఖర్చులు: అచ్చెన్న

ఆరెంజ్‌ తోటల రైతులకు నీటి ఖర్చులు: అచ్చెన్న

మరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): రాయలసీమలో పండ్ల తోటల రైతులు ఆర్థిక భారం భరించి నీటిని తరలించుకుంటున్న నేపథ్యంలో.. వారికి నీటి రవాణా ఖర్చు అందించే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.

అనంతపురం జిల్లాలో 37వేల హెక్టార్లలో స్వీట్‌ ఆరెంజ్‌ తోటలు ఉండగా, 2,260 హెక్టార్లకు సాగునీటి సమస్యను గుర్తించినట్లు సోమవారం మీడియాకు చెప్పారు. ప్రత్యేకంగా మూడు గ్రామాల్లోని 875 హెక్టార్లలో తీవ్ర నీటి కొరత ఉన్నందున రైతులు భారీ వ్యయంతో నీటిని తరలించి, తోటలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy