Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్‌ఎస్‌ ప్రవీణ్.. కల్వకుంట్ల కుటుంబానికి ఊడిగం చేస్తున్నారు: సంపత్ కుమార్

ఆర్‌ఎస్‌ ప్రవీణ్.. కల్వకుంట్ల కుటుంబానికి ఊడిగం చేస్తున్నారు: సంపత్ కుమార్

హైదరాబాద్, ఆగస్టు 5: బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ..

బీఆర్ఎస్ డస్ట్ బిన్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ టిష్యూ పేపర్ అంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత ప్రవీణ్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు. కేసీఆర్ కాళ్లు మొక్కి ఒకే పోస్టులో ఏడు సంవత్సరాలు ఉన్నారని ఆరోపించారు. ప్రవీణ్ కుమార్ జాతి ద్రోహి అని.. బీఎస్పీ పార్టీని కేసీఆర్ కాళ్ల దగ్గర పెట్టారని విమర్శించారు.

ఐపీఎస్‌గా చేసిన వారు కూడా ఇలా ప్రవర్తించడం దారుణమని సంపత్ అన్నారు. కల్వకుంట్ల కుటుంబ మాయమాటల మత్తులో ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నారని... ఆ కుటుంబానికి ఊడిగం చేస్తున్నారని దుయ్యబట్టారు. లీగల్ నోటీసులు ఎప్పుడు పంపుతారో హరీశ్ రావుకు తెలియదా?.. అడ్వకేట్ ఉన్నారు కదా అని నోటీసులు పంపిస్తే ఎలా అని ప్రశ్నించారు. క్షుద్రపూజల ఆరోపణలపై హరీశ్ సమాధానం చెప్పాలని.. సమాధానం చెప్పకుండా నోటీసులు పంపడం విడ్డూరమని సంపత్ కుమార్ వ్యాఖ్యానించారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy