చిత్రజ్యోతి
ఆర్య... విశాల్... ఎనిమీ!

తమిళ హీరోలు విశాల్, ఆర్య గతంలో 'వాడు - వీడు'లో నటించారు. ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఇటీవల ఈ మలీస్టారర్ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రానికి 'ఎనిమీ' టైటిల్ ఖరారు చేసినట్టు చిత్రనిర్మాత వినోద్‌కుమార్ వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ కుదిరింది. ఎవరికి ఎవరు ఎనిమీ అనేది తెరపై చూడాలి. 'వాడు - వీడు'లో పక్కా పల్లెటూరి యువకులుగా నటించిన విశాల్, ఆర్య ఇందులో సరికొత్తగా కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. కథానాయికగా 'గద్దలకొండ గణేష్' ఫేమ్ మృణాళిని రవి, కీలక పాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు'' అని చెప్పారు.
ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy