Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆసియా కప్ 2026.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ప్రకటన

ఆసియా కప్ 2026.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ప్రకటన

స్పోర్ట్స్ డెస్క్: రాబోయే మహిళల ఆసియా కప్ 2026 టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అమితా శర్మ నేతృత్వంలోని మహిళల సెలక్షన్ కమిటీ ఈ జట్టును ఎంపిక చేసింది.

సీనియర్ ప్లేయర్లు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ తర్వాత కొంత విరామం తీసుకున్న భారత మహిళల జట్టుకు ఇదే తొలి టోర్నమెంట్.

ఈ ఆసియా కప్ ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబర్ మధ్య వరకు జరగనుండగా, టోర్నీ నిర్వహణ తేదీలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. అత్యవసర పరిస్థితులు లేదా ఆటగాళ్ల గాయాలను దృష్టిలో ఉంచుకుని ఐదుగురు రిజర్వ్ ప్లేయర్లను కూడా కమిటీ ఎంపిక చేసింది. టీ20 ప్రపంచ కప్ జట్టులో ఉన్న శ్రేయాంక పాటిల్‌కు ఆసియా కప్ జట్టులో స్థానం దక్కలేదు. ప్రపంచ కప్2026లో ఆమె స్థానంలో వచ్చిన ప్రేమా రావత్ ఆసియా కప్ జట్టులోనూ కొనసాగింది.

37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఆసియా కప్‌లో ఘనమైన రికార్డు ఉంది. ఆమె సారథ్యంలో భారత్ ఇప్పటికే 2016, 2022లలో ఆసియా కప్ టైటిళ్లను గెలుచుకోగా, 2012లో సభ్యురాలిగా విజేత జట్టులో భాగమైంది. తన సుదీర్ఘమైన కెరీర్ ముగింపు దిశగా సాగుతున్న వేళ, భారత్‌కు మరో ఆసియా కప్ అందించాలనే పట్టుదలతో ఉంది.

భారత జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, రీచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమలిని (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, ప్రేమా రావత్, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, నందిని శర్మ, క్రాంతి గౌడ్.

రిజర్వ్ ప్లేయర్లు: ప్రతీకా రావల్, ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), వైష్ణవి శర్మ, సాయలీ సత్ఘారే, మిన్ను మణి.

strong>

అభిషేక్ శర్మ సిక్సర్ల తుఫాన్.. 91 బంతుల్లో 233 పరుగులు

భారత జట్టుకు బిగ్ షాక్.. కీలక ప్లేయర్ ఔట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy